ర‌విబాబుతో ఫైర్ బ్రాండ్ తో ఏం చేయ‌బోతుంది?

Ravi Babu Scary Picture With KanganaRavi Babu Scary Picture With Kangana

టాలీవుడ్‌లో విభిన్నమైన థ్రిల్లర్.. హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు రవిబాబు  ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌తో ఓ  క్రేజీ ప్రాజెక్ట్ లాక్ అయిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. `అనసూయ`, `అవును` వంటి చిత్రాలతో  ప్రేక్షకులను భయపెట్టిన రవిబాబు ఈసారి తన మార్క్ ఎక్స్‌పెరిమెంటల్ హారర్ కథతో కంగనాను డైరెక్ట్  చేస్తున్నార‌నే వార్త  ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ - ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయట‌.

`స్కేరీ పిక్చర్` అనే ఆసక్తికరమైన టైటిల్‌తో సినిమా తెర‌కెక్కుతుంద‌ని స‌మాచారం. గతంలో `రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్`, `చంద్రముఖి 2` వంటి చిత్రాల్లో నటించిన కంగనాకు హారర్ జోనర్ కొత్త కాక‌పోయినా? రవిబాబు మేకింగ్ స్టైల్‌లో ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

గతంలో ప్రభాస్ హీరోగా నటించిన `ఏక్ నిరంజన్` తర్వాత దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కంగనా మళ్లీ తెలుగు దర్శకుడితో పనిచేస్తుండటం విశేషం. భారతీయ హారర్ సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించాలనే రానా దగ్గుబాటి విజన్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోందంటున్నారు. మ‌రి ఈ ప్ర‌చారం వెనుక నిజా నిజాలు తేలాల్సి ఉంది.
 

Ravi Babu - Kangana