పవర్ స్టార్ తో అనీల్ ని సెట్ చేస్తున్నారా?
Pawan Kalyan, Anil Ravipudi Combo Movie Under Dil Raju Bannerప్రస్తుతం ఓ క్రేజీ కాంబినేషన్ గురించి జోరుగా చర్చ నడుస్తోంది. `వకీల్ సాబ్` తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను దిల్ రాజు ప్రత్యేకంగా కలవడం.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అవకాశం ఉంటే పవన్‌తో మరో అద్భుతమైన సినిమా చేస్తానని హింట్ ఇవ్వడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఇదే సమయంలో దిల్ రాజు 2028 సంక్రాంతి బరిలో ఆస్థాన దర్శకుడు.. హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో సినిమా ఉండబోతోందని కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ సినిమాలో హీరో ఎవరనే విషయంపై మాత్రం దిల్ రాజు సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అనిల్ రావిపూడి ముందుగా కథను సిద్ధం చేసిన తర్వాతే హీరోను ఫైనల్ చేస్తారని ఆయన చెప్పినా? ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ పేరు బలంగా వినిపిస్తోంది. 4 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా పవన్ డేట్స్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని.. అందుకు అనిల్ రావిపూడి అయితేనే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారని దిల్ రాజు భావిస్తున్నట్లు టాక్.
పవన్ కళ్యాణ్ - అనిల్ రావిపూడి - దిల్ రాజు కాంబినేషన్ గనుక నిజంగానే సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద
ఆ లెక్క వేరు. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌కు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ తోడైతే అది వేరే లెవల్‌లో ఉంటుంది. 2027 సంక్రాంతి సినిమా పూర్తయిన వెంటనే అనిల్ చెప్పే కథకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.














































