ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> No Re-Entry for Rohit in Bigg Boss Telugu 10

BB10: రోహిత్ రీ ఎంట్రీ విషయం మరిచిపోండి

No Re-Entry for Rohit in Bigg Boss Telugu 10No Re-Entry for Rohit in Bigg Boss Telugu 10


బిగ్ బాస్ సీజన్ 10 లో రెండు వారాల క్రితం హౌస్ మేట్స్ సపోర్ట్ లేక ఎలిమినేటయిన రోహిత్ నాయుడు రీ ఎంట్రీ పై గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పటివరకు ఏ సీజన్ కంటెస్టెంట్స్ పై రాలేదు. రోహిత్ ఎలిమినేషన్ అన్యాయం అంటూ రోహిత్ అభిమానులు రచ్చ చేసారు, రీ ఎంట్రీ ఇప్పించాలని డిమాండ్ చేశారు.

కానీ బిగ్ బాస్ టీం మాత్రం రోహిత్ ఫ్యాన్స్ డిమాండ్ ని అస్సలు కన్సిడర్ చెయ్యలేదు. ఇక మూడు వారాల గేమ్ ఉంటుంది. ఇప్పుడు రోహిత్ ని రీ ఎంట్రీ ఇప్పించి ఏం చేస్తారు. అందుకే బిగ్ బాస్ టీమ్ కూడా సైలెంట్ గా ఉంది. రోహిత్ పీఆర్ టీం, అలాగే రోహిత్ కి భజన చేసే బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా రోహిత్ రీ ఎంట్రీ విషయాల్లో చాలానే హడావిడి చేశారు.

కానీ రోహిత్ రీ ఎంట్రీ ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఇప్పటికే హౌస్ లో చాలామంది ఉన్నారు, రెండు వారాలు డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఇకపై రోహిత్ ని పంపించి ఏం ప్రూవ్ చేస్తారంటున్నారు. ఇక రోహిత్ లేకపోవడంతో బిగ్ బాస్ చూడడం లేదు అని అభిమానులు చెప్పినా బిగ్ బాస్ అస్సలు రోహిత్ రీ ఎంట్రీ విషయంలో ఆలోచన చెయ్యలేదని టాక్. 

Bigg Boss Telugu 10