ఇది కదా కావాల్సింది శ్రీలీలా..!
Sreeleela look in OM Movie
క్యూట్ బ్యూటీ శ్రీలీల కెరీర్ ఆరంభం నుంచి ఒకటే రకమయిన కేరెక్టర్స్ తో ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. రిచ్ గర్ల్, లేదంటే కంపెనీ కి CEO గానో ఇలా కనిపించింది తప్ప నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసింది చాలా తక్కువ. అందుకే తెలుగులో శ్రీలీల త్వరగా కనుమరుగయ్యింది.
తెలుగులో ఛాన్సెస్ లేకపోతేనేమి.. అమ్మడు తమిళ, హిందీ పరిశ్రమల్లో చాలా బిజీగా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల నటించిన తమిళ మూవీ ఓం విడుదలకు సిద్ధమైంది. ధనుష్ హీరోగా సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా నటించిన ఓం నవంబర్ 20 న విడుదలకు సిద్దమైది. తాజాగా ఓం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఈ చిత్రంలో శ్రీలీల ధనుష్ కి భార్యగా సాదాసీదా మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించబోతుంది. శ్రీలీల లుక్ చూసి, ఆమె కేరెక్టర్ చూసి అందరూ ఇది కదా శ్రీలీల నీ నుంచి కావాల్సింది, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర లో కనిపిస్తేనే కెరీర్ బావుంటుంది. ఓం లో శ్రీలీల నటన పరంగా నిరూపించుకుంటుంది అని ఆమె అభిమానులు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.














































