కంగనా పై FIR నమోదు

FIR registered against KanganaFIR registered against Kangana

 

బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ పై FIR నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. గాంధీ కుటుంబం పై అనుచిత  పోస్ట్ లు పెట్టారు అన్న కారణంగా కంగనా పై సిమ్లాకు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి కెప్టెన్ అతుల్ శర్మ హిమాచల్ ప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దానితో DGP ఆదేశాలతో కంగనా పై కేసు నమోదు చేసారు సిమ్లా పోలీసులు.

సోనియా గాంధీ పై కంగనా X వేదికగా పెట్టిన పోస్ట్ లు ఆమెకు తలనెప్పిని తెచ్చిపెట్టాయి. నవంబర్ 10న కంగనా తన X ఖాతాలో సోనియా గాంధీని రహస్య విదేశీయురాలు అని సంబోధిస్తూ, కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో ఆమె అధికారం చేపట్టారని అర్థం వచ్చేలా రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని ఆరోపించారు.

మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అలాగే సంజయ్ గాంధీల మరణాలపై కంగనా రనౌత్ అనుమానాలు రేకెత్తించేలా పెట్టిన పోస్ట్ లపై నమోదు అయిన ఫిర్యాదు తో కంగనా పై సిమ్లా పోలీసులు FIR నమోదు చేసి విచారణ చేపట్టారు.
 

Kangana Ranaut Faces Police Case