ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kiara Advani on Toxic intimate scenes

అలాంటి సీన్స్ అవసరమా? అన్నోళ్ల‌కు కియారా కౌంటర్!

Kiara Advani on Toxic intimate scenes Kiara Advani on Toxic intimate scenes

యష్ క‌థానాయ‌కుడిగా గీతు మోహన్‌దాస్  తెరకెక్కించిన `టాక్సిక్`  చిత్రంలో కియారా అద్వానీ  చేసిన పాత్ర .. కొన్ని సన్నివేశాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్రంలో యశ్‌తో కియారా నటించిన  రొమాంటిక్, ఇంటిమేట్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు త‌లెత్తాయి. తాజాగా `కాఫీ విత్ కరణ్` షోలో పాల్గొన్న కియారా ఈ వివాదాలపై తొలిసారి నోరు విప్పారు.

భర్త సిద్ధార్థ్ మల్హోత్రా  రియాక్షన్ గురించి కియారా మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న విమర్శల గురించి సిద్ధార్థ్ ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదని అసలు ఆ విషయమే తమ మధ్య చర్చకు రాలేదని తెలిపారు. వివాహం అయిన తర్వాత ఇలాంటి సన్నివేశాలలో నటించడంపై కొందరు కావాలనే వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని అయితే ఇండస్ట్రీలో ఇలాంటి జెండర్ బయాస్ కొత్తేమీ కాదని  పేర్కొన్నారు. సిద్ధార్థ్ వృత్తిపరమైన నిర్ణయాలను పూర్తిగా గౌరవిస్తాడని.. ఈ విషయాలు తన భర్తను ఏమాత్రం ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు.

ఇదే ఇంటర్వ్యూలో సినిమా ఫలితంపై కూడా కియారా ఆవేదన వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం తనను ఎంతో కృంగదీసిందని.. ఆ వీకెండ్ తనకు చాలా కష్టంగా గడిచిందని అన్నారు. అయినా? కంఫర్ట్ జోన్ దాటి  విభిన్నమైన బలమైన పాత్రను ఎంచుకున్నందుకు వచ్చిన ప్రశంసలు  కొండంత బలాన్నిచ్చాయని కియారా పేర్కొన్నారు.
 

Toxic Intimacy: Kiara on her husband reaction