సూర్య హ్యాట్రిక్ కొట్టినట్లేనా?
Suriya scores a hat-trick?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది హ్యాట్రిక్ విజయాలు సాధించినట్టేనా.. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ తో రెండుసార్లు రెండువందల కోట్ల క్లబ్బులోకి వెళ్లిన సూర్య మూడవ చిత్రం సీన్ తోనూ హిట్ అందుకుని హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తారని ఆయనే కాదు అభిమానులు కూడా బలంగా నమ్మారు.
దివాళీ స్పెషల్ గా విడుదలైన సీన్ చిత్రానికి కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. క్రిటిక్స్, ఆడియన్స్ ఇద్దరూ ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్ ని చూపించారు. దానితో సూర్య సీన్ తో హ్యాట్రిక్ కొట్టడం కలే అనుకున్నారు. కానీ మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సూర్య సీన్ సుమారు రూ.149.55 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.
మరి ఈలెక్కన సెకండ్ వీకెండ్ కల్లా సీన్ చిత్రం రూ.200 కోట్ల క్లబ్బులోకి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. అంటే సీన్ తో కలిపి సూర్య ఈఏడాది మూడు సినిమాలు వరసగా మూడుసార్లు రూ.200 ఓట్ల క్లబ్బులోకి అడుగుపెడితే సూర్య హ్యాట్రిక్ సాధించినట్టేగా.. !















































