గాడ్ ఆఫ్ వార్ ఉంటుందా?

Doubts regarding God of WarDoubts regarding God of War


త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో సెకండ్ మూవీ గా అనౌన్సమెంట్ వచ్చిన గాడ్ ఆఫ్ వార్(వర్కింగ్ టైటిల్) సెట్స్ పైకి వెళుతుందా? అసలు గాడ్ ఆఫ్ వార్ ఉంటుందా? లేదంటే అనౌన్సమెంట్ తోనే ఈ కాంబో మూవీ ఆగిపోతుందా.. ఇదే ఇపుడు సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ. కారణం త్రివిక్రమ్ కి గుంటూరు కారం, ఆదర్శ కుటుంబం బ్యాక్ టు బ్యాక్ షాక్ లు.

అంతేకాదు త్రివిక్రం సినిమాలపై కాపీ రైట్ వివాదాలు. దానితో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యేలా చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో పై ఆందోళన పడుతున్నారు. డ్రాగన్ కన్నా ముందు దేవర, వార్ 2 చిత్రాలతో పూర్తి స్థాయి హిట్స్ కొట్టలేకపోయిన ఎన్టీఆర్ డ్రాగన్ తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ తర్వాత కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వాలి కానీ.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఉన్న దర్శకుడితో ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదు.. నెల్సన్ తో నీ తదుపరి మూవీ చెయ్యి అన్నా అంటూ ఎన్టీఆర్ కి అభిమానులు రిక్వెస్ట్ పెడుతున్నారు. మరి డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ సెట్ పైకి వెళతారో, లేదో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 

God of War