చంపకుండా చంపేశారు
AP school chainsaw attack: Accused's leg amputated
అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాల లో 10 వ తరగతి విద్యార్థిని గోపికను ప్రేమోన్మాది హేమంత్ చెట్లు నరికే ఎలక్ట్రిక్ రంపంతో కోసేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విద్యార్థినిని ప్రేమ పేరుతొ ఏడిపించడమే కాదు.. స్కూల్ లో ఉన్న సమయంలో ఎలాంటి భయం లేకుండా ఆ విద్యార్థినిని కోసేయ్యడం, అడ్డు వచ్చిన మరో విద్యార్థినికి గాయపరిచి పారిపోవడం సంచలనం సృష్టించింది.
విద్యార్థి గోపిక ప్రస్తుతం బెంగుళూరు మణిపాల్ ఆసుపత్రిలో చావుబ్రతుకల మధ్యన చికిత్స పొందుతుంది. దాడి తర్వాత అక్కడి నుంచి పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు 25 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడు హేమంత్‌ను పట్టుకునే క్రమంలో, అతడు పోలీసులపై కత్తితో దాడికి యత్నించాడు. దానితో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఆ బుల్లెట్స్ నిందుతుడి రెండు కాళ్ళలో దిగబడ్డాయి. గాయాలతో నిందుతుడు హేమంత్ ను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స ఇప్పిస్తున్నారు పోలీసులు. ఈ విషయంలో ప్రజలంతా పోలీసుకు హ్యాట్సాఫ్ చెప్పారు. అయితే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హేమంత్ కుడికాలు పూర్తిగా తొలగించారు.
మరి నిజంగా చంపేస్తే నిందితుడి ఒక్క దెబ్బకు చనిపోయేవాడు. కానీ ఇలా బాధను అనుభవిస్తూ బ్రతకడం అనేది ఎంత నరకమో హేమంత్ కు తెలుస్తుంది. నిజంగా నిందితుడిని చంపెయ్యకుండా పోలీసులు చంపేశారు.. అంటూ రాప్తాడు పోలీసులను ప్రజలు మెచ్చుకోవడం గమనార్హం.















































