ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Housemates target Varshini

బిగ్ బాస్ 10: హౌస్ మేట్స్ టార్గెట్ వర్షిణి

Bigg Boss 10: Housemates target VarshiniBigg Boss 10: Housemates target Varshini


బిగ్ బాస్ సీజన్ 10 లోకి సెలెబ్రిటీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టాస్క్ ఆడకుండా ముఖేష్ తో ప్రేమాయణం, త్రిగుణ స్నేహాన్ని వదులుకున్న యాంకర్ వర్షిణి ఈ వారం హౌస్ మేట్స్ కి టార్గెట్ అయ్యింది. నామినేషన్స్ లో ఎన్నోసార్లు బోటం లైన్ వరకు వెళ్ళింది. ఒకసారి ముఖేష్ సేవ్ చేసాడు, మరోసారి అమన్ మ్యాజిక్ కీ తో టాస్క్ ఆడకుండానే వర్షిణి కెప్టెన్సీ సొంతం చేసుకుంది.

ఇక ముఖేష్, సుధీర్ లతో కలిసి కంఫర్ట్ జోన్ లో ఉన్న వర్షిణి రోహిత్ వాళ్ళ తో కలిసి పెట్టిన ముచ్చట్లు ఆమె కొంప ముంచాయి. త్రిగుణ అల్టిమేట్ గోట్ అయ్యాక బిగ్ బాస్ గిఫ్ట్ అంటూ వర్షిణి త్రిగుణ ని అన్న మాటలు వీడియోస్ వేసి చూపించారు. త్రిగుణ నా ఫ్రెండ్, కానీ దానికి వర్త్ కాదు, అతని వీక్ పాయింట్ నాకు తెలుసు, దాని మీద కొట్టానంటే పడిపోవాలి అంటుంది, దానికి సుధీర్, ముఖేష్ కొట్టమని చెబుతారు.

తర్వాత రోహిత్ తో P అండ్ B లెటర్స్ విషయంలోనూ అందరి ముందు వర్షిణిని హోస్ట్ నాగార్జున ఎక్స్పోజ్ చేశారు. ఈ వారం నామినేషన్స్ లో ముఖేష్, రామకృష్ణ, సుధీర్ తప్ప మిగతా వాళ్ళంతా వర్షిణిని నామినేట్ చేసారు. త్రిగుణ అయితే వర్షిణి ఫొటోస్ అన్ని చింపేసి మంట లో వేసి ఆమె చెప్పెది కూడా వినకుండా ఏడిపించాడు.

నరేష్, రామ్ ప్రసాద్, శివ్, నీతూ మాస్టర్ ఇలా ప్రతి ఒక్కరూ వర్షిణి ని నామినేట్ చేస్తూ పెట్టిన పాయింట్స్ కి డిపెండ్ చేసుకోలేక వర్షిణి కి ఏడుపొక్కటే తక్కువ. ఈ వారం వర్షిణి పక్కాగా ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అనిపిస్తుంది. 

Bigg Boss Telugu 10