హీరోలు ప్రిపేర్ అవ్వాల్సిందే !
Tension begins among the heroes when Friday arrives
గతంలో ఫ్రైడే వస్తుంది అంటే కొత్త సినిమాలు వస్తాయి.. అవి హిట్ అయితే సక్సెస్ మీట్స్ పెట్టి హ్యాపీగా సెలెబ్రేట్ చేసుకునే హీరోలు.. సినిమా ప్లాప్ అయితే సైలెంట్ గా ఇంట్లోనే ఉండి.. రెండుమూడు నెలలు మూడీగా ఉంటూ కొద్దిగా బ్రేక్ తీసుకుని మరొక సినిమాతో బిజీ అయ్యేవారు. హిట్ అయితే క్రేజీ ప్రాజెక్ట్స్, ప్లాప్ అయితే కొత్త కథలు, ఆచి తూచి దర్శకులను సెట్ చేసేవారు.
కానీ ఇప్పుడు సోషల్ మీడియా పాపులర్ అయ్యాక సినిమాలు విడుదలవుతున్నాయి అంటే హీరోలు టెన్షన్ పడాల్సిన సమయం వచ్చింది. సినిమా హిట్ అయితే ఆహా ఓహో అనే వాళ్ళే, ప్లాప్ అయితే విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అది కూడా అతి దారుణంగా ట్రోల్ చేస్తూ డిప్రెషన్ లోకి వెళ్లేట్టుగా చేస్తున్నారు.
సినిమా హిట్ అయితే సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుని విదేశాలకు చెక్కేసే హీరోలు, ప్లాప్ అయితే సోషల్ మీడియా ట్రోలింగ్ తో సతమతమవుతున్నారు. ఫ్రైడే వస్తుంది అంటే ఆ హీరోల ఫేట్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటే.. విపరీతమైన టెన్షన్ లో హీరోలు, మిగతా నటులు ఉంటున్నారు.
ఇకపై హిట్ అయితే అప్రిసేషన్స్ అందుకోవడానికి, ప్లాప్ అయితే ట్రోలింగ్ తీసుకోవడానికి హీరోలు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సిందే. బావుంది అంటే బావుంది, బాలేదు అంటే బాలేదు అంతే. అదే హీరోలు అది తీసుకోవాలి.















































