ఆదర్శ కుటుంబం పోస్టర్ పై ట్రోల్స్
Trolls on the Aadarsha Kutumbam poster
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్-త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబానికి ఆడియన్స్ మాత్రమే కాదు, క్రిటిక్స్ కూడా యావరేజ్ రివ్యూస్ ఇచ్చారు. ఈ రెస్పాన్స్ తో సినిమా సర్వైవ్ అవడం కష్టమనే అన్నారు. త్రివిక్రమ్ మాటల్లో పస లేదు, థమన్ మ్యూజిక్ లో మ్యాజిక్ లేదు అన్నారు.
కాకపోతే ఆదర్శ కుటుంబానికి ఎక్కడో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవడంతో ఈ వీకెండ్ ఆదర్శ కుటుంబం థియేటర్స్ కళకళలాడాయి. అయితే ఆదర్శ కుటుంబం వీకెండ్ కలెక్షన్స్ పోస్టర్ అంటూ రూ.75 కోట్ల గ్రాస్ పోస్టర్ వదిలారు మేకర్స్. సినిమాకి రూ.50 కోట్లు వస్తే రూ.75 కోట్ల పోస్టర్ వేశారు అంటూ ఆ పోస్టర్ చూసి అందరూ నవ్వడం గమనార్హం.
మూడు రోజుల్లోనే డివైడ్ టాక్ తో ఆదర్శ కుటుంబం రూ. 75 కోట్ల గ్రాస్ ఎలా వసూలు చేసింది, ఫేక్ పోస్టర్స్ వేసి ఫేక్ కలెక్షన్స్ చెప్పి అభిమానులను, ఆడియన్స్ ను మభ్య పెడుతున్నారు. నిర్మాత నాగవంశీ ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్ లో కనిపించకుండా వెనకుండి గేమ్ ఆడిస్తున్నాడు అంటూ నాగవంశీ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
















































