ఆర్సీ 17 లో సుకుమార్ సెకెండ్ లీడ్స్!
Sukumar’s second leads in RC 17!మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `RC 17`పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. `రంగస్థలం` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్‌పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి క్యాస్టింగ్ వివరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నా? ప్రధాన నాయిక ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
సినిమాలో ప్రాధాన్యత ఉన్న ఇతర పాత్రల కోసం మేకర్స్ విభిన్న నటీమణులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సెకెండ్ లీడ్స్ కోసం టాలెంటెడ్ బ్యూటీ రుక్మిణీ వసంత్ ..చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి నటిగా ఎదుగుతున్న సారా అర్జున్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. విభిన్నమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే సుకుమార్ తన చిత్రాల్లో ప్రతి పాత్రకూ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు భామల పరిశీలనపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
సెకెండ్ లీడ్స్ పేర్లు వైరల్ అవుతున్నా? రామ్ చరణ్ సరసన ప్రధాన పాత్రలో నటించబోయే మెయిన్ లీడ్ హీరోయిన్ ఎవరనే విషయంలో చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సుకుమార్ మార్క్ మేకింగ్‌లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రంపై అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
















































