ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aadarsha Kutumbam new release date confirmed

వెంకీ దిగారు - ఆదర్శం బయటికొస్తుంది

Aadarsha Kutumbam new release date confirmedAadarsha Kutumbam new release date confirmed


పదే పదే విడుదల తేదీలు మార్చుకున్న ఆదర్శక కుటుంబం చిత్రం రిలీజ్ డేట్ ఫైనల్ గా బయటికి వచ్చింది. జైలర్ 2 ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ ని ఆదర్శ కుటుంబం కొత్త తేదీ చెప్పమంటే నన్ను తంతారు, వెంకీ గారు వస్తారు, ఆయనే ఇస్తారని చెప్పారు. ఊటీ నుంచి జనవరి 12 విడుదల షూటింగ్ ఫినిష్ చేసుకుని వెంకీ హైదరాబాద్ లో దిగారు.

వెంకీ దిగారు అంటే ఆదర్శ కుటుంబం బయటికొచ్చినట్టే. వెంకీ సోషల్ మీడియా వేదికగా ఆదర్శ కుటుంబం ఈ నెల 30 అంటే అక్టోబర్ 31 న విడుదల అంటూ కొత్త పోస్టర్ తో ప్రకటించారు. సో నిన్నమొన్నటివరకు ఆదర్శ కుటుంబం నవంబర్ కి వెళుతుంది అనే వార్తలను వెంకీ ఇలా చెక్ పెట్టారు.

అక్టోబర్ 9 న విడుదల వాయిదా పడినప్పుడే అక్టోబర్ 30 కి ఆదర్శ కుటుంబం రిలీజ్ అన్నారు. అనుకున్నదే అయ్యింది. వెంకీ ఆదర్శ కుటుంబం కొత్త తేదీని దసరా పండుగ స్పెషల్ గా ప్రకటించారు.

Aadarsha Kutumbam new release date out