ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> When will complete victory be attained?

సంపూర్ణ విజయం ఎప్పుడు దక్కేనో?

When will complete victory be attained?When will complete victory be attained?


విజయ్ దేవరకొండ కు పర్ఫెక్ట్ విజయం దక్కి చానళ్ళు అవుతుంది. వరస సినిమాలు వుతున్నాయి.. అవి విడుదలైన రోజు బావుంది, యావరేజ్, పర్లేదు అంటున్నారు. కలెక్షన్స్ కూడా నిర్మాతలకు అటు ఇటుగా బయటపడిపోయెలా వస్తున్నాయి. ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్ డమ్ ఇలా ప్రతి సినిమా కూడా విడుదలైన రోజు ఓకే అంటున్నారు.

ప్రేక్షకుల నుంచి యావరేజ్ రెస్పాన్స్, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు విడుదలైన రణబాలి చిత్రానికి కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. సోషల్ మీడియాలో కొంతమంది సినిమా బావుంది అని ట్వీట్లు వేస్తున్నా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. విజయ్, రష్మిక తప్ప సినిమాలో ఏం లేదు అని తేల్చేశారు.

దానితో ఎన్నడూ లేని విధంగా విజయ్ దేవరకొండ భార్య రష్మిక తో కలిసి సినిమాని ప్రమోట్ చేస్తూ హడావిడి చేస్తున్నాడు. విజయ్-రష్మిక ల ప్రమోషన్స్, దసరా హాలిడేస్ రణబాలి కలెక్షన్స్ కి కలిసొస్తున్నాయి.

మరి విజయ్ దేవరకొండ కు ఇలాంటి మిక్స్డ్ రిజల్ట్ కాకుండా సంపూర్ణమైన విజయం ఎపుడు దక్కుతుంది. ఆయన అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. విజయ్ తదుపరి చిత్రం రౌడీ జనార్ధన అయినా విజయ్ దేవరకొండ కు కావాల్సిన విజయాన్ని అందిస్తుందా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ హోప్స్ కూడా రౌడీ జనార్ధన పైనే ఉన్నాయి. 

When will Vijay Deverakonda achieve a complete success?