BB10: ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్
Bigg Boss 10: Bigg Shocking Twist In Elimination
బిగ్ బాస్ సీజన్ 10 లో ఆరో వారం పూర్తయ్యింది. గత ఐదు వారాలుగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఈ వారం వైల్డ్ ఫైర్స్, ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ తో హౌస్ మొత్తం రచ్చ రచ్చగా మారిపోయింది. మరోపక్క రోహిత్, షాలిని జంట అలకలు, కోపాలు, సర్దుకుపోవటాలు అన్ని ఈ వారం హైలెట్ అయ్యాయి.
హోస్ట్ నాగార్జున శనివారం ఎపిసోడ్ లో తప్పు చేసిన ప్రతి కంటెస్టెంట్ ని కోప్పడడమే కాదు.. వారి ఫోటో పగలగొట్టి మరీ వారికి డైరెక్ట్ పనిష్మెంట్స్ ఇచ్చేసారు. రోహిత్ అండ్ గ్యాంగ్ అంటే అమన్, షాలిని లను వార్న్ చేస్తూ ఈ వారం కంటెస్టెంట్స్ రేస్ నుంచి తప్పించారు. నీతూ మాస్టర్ కి క్లాస్ పీకారు. బయట విషయాలు లోపల చెప్పొద్దూ అన్నప్పటికీ చెప్పావ్ అంటూ కోప్పడగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. వర్షిణి ఇంకా షాలిని ఈ వారం ఓటింగ్ లో వీక్ గా కనిపించారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు అయితే హౌస్ ని వీడాల్సిందే అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. షాలిని ఈ వారం ఎలిమినేట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. ఆమె వల్ల రోహిత్ ఆట పోతుంది అని హౌస్ లోనే కాకుండా బయట ఆడియన్స్ లోను అదే మాట.
మరోపక్క వర్షిణి ఎలిమినేట్ అవ్వాలి, ఆమె టాస్క్ పెరఫార్మెన్స్ బాలేదు, వర్షిణి ముఖేష్ చుట్టూ తిరగడం తప్ప ఇంకేమి లేదు అని బయట జనాల భావన. మరి అందరూ ఎక్కువగా కోరుకున్న ఎలిమినేషనే ఈ వారం జరిగిందా అంటే లేదు అంటున్నారు. షాలిని ని ఎలిమినేట్ చేసినట్టు చేసి హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చి ఆమెను సీక్రెట్ రూమ్ కి పంపించినట్టుగా తెలుస్తుంది.
















































