BB10: ఈ వారం లెక్కలు మారుతున్నాయ్

Bigg Boss 10: This week voting resultBigg Boss 10: This week voting result

 

బిగ్ బాస్ సీజన్ 10 లో గత వారం డబుల్ ఎలిమినేషన్, ఐదుగురు వైల్డ్ ఫైర్ లు ఎంట్రీ ఇవ్వడం అన్ని జరిగిపోయాయి. ఈ వారం వైల్డ్ ఫైర్స్, అలాగే ఒరిజినల్ గ్యాన్డ్ స్టర్స్ నడుమ ఆటల యుద్ధమే కాదు, వైల్డ్ ఫైర్స్ చేతిలో నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.

షాలిని, వర్షిణి, అమన్, రోహిత్, రాం ప్రసాద్, వంశీలు ఈ వారం నామినేషన్స్ లో ఉండగా.. ముందు రెండు రోజులు ఓటింగ్ లో షాలిని, వర్షిణి వెనుకబడిపోయారు. రోహిత్ మొదటి నుంచి ఓటింగ్ లో టాప్ పొజిషన్ లోనే ఉన్నాడు. కానీ శుక్రవారం వచ్చేసరికి ఓటింగ్ లో లెక్కలు మారిపోయాయి.

ఇక ఈ వారం త్రిగుణ్ నామినేషన్స్‌లో లేడు కాబట్టి.. అతని ఫ్రెండ్ వంశీకి త్రిగుణ్ ఫ్యాన్స్ ఓట్లు షిఫ్ట్ అవుతున్నాయి. రాంప్రసాద్ మూడో స్థానానికి వచ్చేశాడు. ఆతర్వాత స్థానాల్లో అమన్, షాలిని, వర్షిణి ఉన్నారు. షాలిని కి రోహిత్ కి మధ్యన ఫైట్ అవ్వడం, వారి గుసగుసలు బిగ్ బాస్ కి కంటెంట్ అందిస్తున్నారు షాలిని ని ఈ వారం ఎలిమినేట్ చేసే ఉద్దేశ్యం కనిపించడం లేదు.

ఫైనల్ గా వర్షిణి ఈ వారం ఎలిమినేట్ అవడం పక్కాగా కనిపిస్తుంది.ముఖేష్ నామినేషన్స్ లో లేడు అయినా ఆయన ఫ్యాన్స్ వర్షిణి ని సపోర్ట్ చెయ్యడం లేదు, ముఖేష్-వర్షిణి బాండింగ్ ముఖేష్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. అందుకే వర్షిణి ఓటింగ్ లో వెనుకబడిపోయింది. ఇక ఫైనల్ గా ఈ వారం డేంజర్ లో వర్షిణి ఉంది. 

Bigg Boss Telugu 10