టాలీవుడ్ మూవీస్ పై నారా లోకేష్ ఇంట్రెస్ట్
Nara Lokesh's interest in Tollywood movies
ఏపీ మినిస్టర్ నారా లోకేష్ టాలీవుడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ట్వీట్లు వేయడం ఈరోజు శనివారం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా రాహుల్ సంకృత్యన్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన రణబాలి చిత్ర ట్రైలర్ చూసి.. పొగుడుతూ ట్వీట్ చేసారు.
#Ranabaali ట్రైలర్ ఇప్పుడే చూశాను, వావ్, ఎంత అద్భుతమైన అనుభూతి! 1800ల నాటి రాయలసీమను పునఃసృష్టించడంలో, బ్రిటిష్ వారి కాలంలోని కరువు, అణచివేతతో నిండిన ఆ హృదయవిదారక యుగాన్ని చిత్రీకరించడంలో చూపిన శ్రద్ధ అసాధారణం.విజయ్ దేవరకొండ చాలా సునాయాసంగా, సీమ నేలలో పూర్తిగా ఇమిడిపోయినట్లుగా కనిపిస్తున్నారు. @iamRashmika ఈ పాత్రకు అద్భుతంగా ప్రాణం పోశారు. చరిత్రలోని ఇంతటి శక్తివంతమైన, చెప్పని అధ్యాయానికి ప్రాణం పోసినందుకు @రాహుల్ సంకృత్యన్ మరియు చిత్ర బృందానికి అభినందనలు. అక్టోబర్ 16న మీ అందరికీ గొప్ప విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాము! అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
ఇదే రోజు గరివిడి లక్ష్మి ట్రైలర్ ను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న గరివిడి లక్ష్మి సినిమా పాటలు, టీజర్ నాలో ఆసక్తి రేపాయి. ఎవరీ గరివిడి లక్ష్మి, ఏంటా కథ అని ఆరా తీశాను. ఊరు పేరునే ఇంటి పేరుగా, బుర్రకథనే జీవితంగా బతికి, కళని బతికించిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ గాథ ఆధారంగా గరివిడి లక్ష్మి సినిమా తెరకెక్కుతోందని తెలిసింది.
చదువుకోకపోయినా సాంప్రదాయ బుర్రకథ శైలికి ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలు జోడించి బుర్రకథ కళకే వన్నెతెచ్చిన గరివిడి లక్ష్మి సినిమా విడుదల కోసం ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన కళాకారులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. @anandhiactress @smayurk అంటూ ట్వీట్ చేశారు.
మరి ఈ రెండు చిత్రాలు ఆంధ్ర లోని కీలక ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కినవి కావడంతో మంత్రి నారా లోకేష్ ఆ సినిమాలను, ఆ సినిమాల నేపధ్యాలను పొగుడుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
















































