బిగ్ బాస్ 10: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్
Bigg Boss 10: Shocking elimination this week
బిగ్ బాస్ సీజన్ 10 లో వారినికొక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. చైత్ర రాయ్, కృష్ణుడు, మిథిలేష్, సృష్టి లు ఇప్పటివరకు నాలుగు వారాలకు గాను ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు. ఈ వారం డేంజర్ జోన్, సేఫ్ జోన్ అంటూ టాస్క్ లు ఆడి త్రిగున్, అమన్ అలాగే రాంప్రసాద్ లు సేఫ్ అయ్యారు.
రోహిత్, ముఖేష్, ఝాన్సీ, అపూర్వ, షాలిని, చరణ్, నరేష్ లలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో, అసలు ఈ వారం సింగిల్ ఎలిమినేషనా, లేదంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే కన్ఫ్యూజన్ లో ఆడియన్స్ ఉన్నారు. అయితే ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని, శనివారం ఎపిసోడ్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లుగా తెలుస్తుంది.
రెండు వారాల క్రితం వైల్డ్ కార్డు తో అగ్నిపరీక్ష నుంచి హౌస్ లోకి వచ్చిన అపూర్వ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. హౌస్ లోకి వచ్చాక త్రిగున్, ముఖేష్ లపై కక్ష పెట్టుకోవడం, కెప్టెన్ అయ్యాక వరెస్ట్ గా బిహేవ్ చెయ్యడం, ఆమె అరుపులతో హౌస్ మొత్తం డిస్టర్బ్ అవడం ఇవన్నీ అపూర్వకి మైనస్ అయ్యాయి.
ఇక రోహిత్ విషయంలో షాలిని దగ్గర గొడవ పడడం కూడా అపూర్వ కి మైనస్ అయ్యింది. ఆమె అరుపులు భరించలేకే ఆడియన్స్ ఆమెను హౌస్ నుంచి పంపించేశారు, అసలు ఓటింగ్ లో అపూర్వ లీస్ట్ లో ఉండడంతో ఆమె ఈ వారం హౌస్ నుంచి ఇంటికెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది.
















































