ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Nagarjuna Fires On Shalini and Rohit

BB10: రోహిత్-షాలిని ప్రేమకలాపాలపై నాగ్ సెటైర్

Bigg Boss 10: Nagarjuna Fires On Shalini and RohitBigg Boss 10: Nagarjuna Fires On Shalini and Rohit


గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ హౌస్ లో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన రోహిత్, షాలిని నడుమ లవ్ ట్రాక్ స్టార్ట్ అవడమే కాదు.. వారు ప్రేమలో పడి తడిచిముద్దవుతున్నారు. హగ్గులు, గుసగుసలు, అర్ధరాత్రి వరకు మాట్లాడుకోవడం ఇవన్నీ ఆడియన్స్ లో అనుమానాలు కలుగజేస్తున్నాయి. అంతేకాదు రోహిత్ అటు అపూర్వ, ఇటు షాలిని నడుమ నలిగిపోతున్నాడు.

వారి ప్రేమ విషయంలో బయట జనాలేం అనుకుంటున్నారో ఈరోజు శనివారం ఎపిసోడ్ లో నాగార్జున అదే అడిగారు. ఈరోజు కుండపగలగొట్టి మరీ ఒక్కొక్కరికి తాట తీశారు హోస్ట్ నాగార్జున. అమ్మా అరపూర్వ అంటూ అపూర్వని లేపారు. ఎందుకలా పిలిచాను అంటే అరుస్తున్నాను అని అంది, మరి తెలిసినదానివి ఎందుకరుస్తున్నావ్ అన్నారు.

వర్షిణి నీ కెప్టెన్సీ ఎలా ఉంది అంటే ఎక్స్పీరియన్స్ అంది, ఎవరికీ అన్నారు నాగ్. ఇక వాష్ రూమ్స్ పై కంప్లైంట్స్ అంది అపూర్వ. అది ఎవరి పని అంటే రోహిత్, షాలిని అన్నారు. దానికి పాపం అర్ధరాత్రి వరకు మాట్లాడుకుంటే వాళ్ళేం చేస్తారులే అంటూ నాగ్ రోహిత్, షాలిని పై వీడియో చూపిస్తూ సెటైర్ వేశారు. వారి ఫేసులు మాడిపోవడం ప్రోమో లో హైలెట్ అయ్యింది.

అమన్ బూతులు వాడుతున్నావ్ అని మందలించిన నాగ్ ఝాన్సీ నువ్వు పల్లెటూరి నుంచి వచ్చావ్, స్వచ్ఛమైన మనసు ఉంటుంది అనుకుంటే.. ఆటలో చీటింగ్ చేసావ్ అంటూ వీడియో వేసి చూపించగానే ఝాన్సీ ఏడుపు స్టార్ట్ చేసిన ప్రోమో ని వదిలారు.. స్టార్ మా వాళ్ళు.

Bigg Boss Telugu 10: Nag Fires On Shalini and Rohit