ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tollywood Box Office: Comrade Kalyan vs Hanuman Ansh

కామ్రేడ్ పై డబ్బింగ్ ప్రభావమెంత

Tollywood Box Office: Comrade Kalyan vs Hanuman AnshTollywood Box Office: Comrade Kalyan vs Hanuman Ansh


ఆదర్శ కుటుంబం అక్టోబర్ 9 నుంచి వాయిదా పడడంతో కూల్ గా బరిలోకి దిగుతున్నాడు కామ్రేడ్ కళ్యాణ్. కోన వెంకట్, సత్య లతో కలిసి కామ్రేడ్ కళ్యాణ్ ని ప్రమోట్ చేస్తూ సినిమాపై శ్రీ విష్ణు ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ అంటే సీరియస్ కంటెంట్ కాదు, కామెడీతో కూడిన కంటెంట్ అని ట్రైలర్ తోనే రివీల్ చేసారు మేకర్స్.

అయితే కామ్రేడ్ కళ్యాణ్ పై డబ్బింగ్ మూవీ హనుమాన్ అంశ్ ప్రభావం ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు ఆడియన్స్ లోను, ట్రేడ్ లోను ఆసక్తికరంగా మారింది. హిందీలో తెరకెక్కిన హనుమాన్ అంశ్ ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. చాలా తక్కువ అంటే కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ అంశ్ రూ.400 కోట్లు తేవడం అంటే మాములు విషయం కాదు.

మరి అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తెలుగు ఆడియన్స్ ను ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుంది, తెలుగు ఆడియన్స్ కూడా హనుమాన్ అంశ్ కి కనెక్ట్ అయితే కామ్రేడ్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి, అసలు ఈ డబ్బింగ్ మూవీ హనుమాన్ అంశ్ ప్రభావం కామ్రేడ్ కళ్యాణ్ పై ఎంత ఉంటుంది అనేది మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.

 

Comrade Kalyan vs Hanuman Ansh