ప్యారడైజ్ ఓటీటీ డేట్

The Paradise OTT date lockedThe Paradise OTT date locked


హీరో నాని - శ్రీకాంత్ ఓదెల కలయికలో సెకండ్ మూవీగా తెరకెక్కిన చిత్రం ది ప్యారడైజ్. దసరా చిత్రంతో పాన్ ఇండియాలో సత్తా చాటలేకపోయిన ఈ ద్వయం ప్యారడైజ్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేద్దామని బోర్లా పడ్డారు. నాని ప్యారడైజ్ చిత్రానికి ప్రీమియర్స్ రోజే డివైడ్ టాక్ మొదలైపోయింది.

పోస్ట్ ప్రమోషన్స్ చేసినా ఫలితం దక్కలేదు. దానితో ది ప్యారడైజ్ చిత్రం థియేటర్స్ లో ప్లాప్ లిస్ట్ లకి వెళ్ళిపోయినట్లే. సెప్టెంబర్ 24 న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ఇంప్రెస్స్ చెయ్యడంలో తడబడింది. అయితే ప్యారడైజ్ చిత్రం ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుంది అనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది.

అంటే హిట్ అయితే నాలుగు వారాలు, ప్లాప్ అయితే మూడు వారాల గ్యాప్ లో సినిమాలు థియేటర్స్ నుంచి ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అందుకే ప్యారడైజ్ ఎలా ఎన్ని వారాల గ్యాప్ లో ఓటీటీ లోకి వస్తుందో అనేది ఆసక్తిగా మారింది. అయితే నాని ప్యారడైజ్ నాలుగు వారాల గ్యాప్ లోనే ఓటీటీ కి వస్తుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ది ప్యారడైజ్ చిత్రం డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. ఇన్ సైడ్ సమాచారం ప్రకారం అక్టోబర్ 23 నుంచి ప్యారడైజ్ నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

The Paradise