ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> BB10: Argument with Shalini, Apoorva breaks down in tears

BB10: షాలినితో గొడవ, ఏడ్చేసిన అపూర్వ

BB10: Argument with Shalini, Apoorva breaks down in tearsBB10: Argument with Shalini, Apoorva breaks down in tears

 

బిగ్ బాస్ సీజన్ 10 లో ప్రస్తుతం హౌస్ మొత్తం అగ్నిపరీక్ష టీం vs సెలబ్రిటీస్ కింద విడిపోయారు. ఐదో వారం నామినేషన్స్ లో వారి మద్యన గొడవ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఈసారి వాళ్లలో అందరూ నామినేషన్స్ లో ఉండాలని కామనర్స్ లో రోహిత్ ప్లాన్ చేసాడు, సెలెబ్రిటీస్ లో అందరూ కామనర్స్ ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేసారు.

ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయ్యాక షాలినికి, అపూర్వకి రోహిత్ విషయంలో పెద్ద గొడవే జెరిగింది. రోహిత్ తో నేను క్లోజ్ అంటే నేను క్లోజ్ అన్న విషయంలో అపూర్వ-షాలిని మద్యన జరిగిన గొడవ గత రాత్రి ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది. రోహిత్ - షాలిని మాట్లాడుకుంటుంటే అపూర్వమద్యలో దూరుతోంది అని షాలిని, మీ విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, నాకు మేనర్స్ ఉంది అని అపూర్వ గొడవ పడ్డారు.

నువ్వు త్రిగున్ కన్నా చీప్ మెంటాలిటి, చీప్ పర్సనాలిటీ అంటూ అపూర్వని షాలిని టార్గెట్ చేసింది. ఈ గొడవ మధ్యలో రోహిత్ రోస్ట్ అయ్యాడు. ఇక అపూర్వ రామ్ ప్రసాద్ తో గొడవపడింది. సరదాగా చేసిన సంభాషణ ను రాంప్రసాద్ సీరియస్ అనడంపై అపూర్వ రచ్చ చేసింది. సుధీర్ తో లవ్ ట్రాక్, మ్యారేజ్ కామెంట్స్ పై అపూర్వ సరదా అంటే రాంప్రసాద్ సీరియస్ అంటూ గోల గోల చేసారు.

ఆతర్వాత అపూర్వ చరణ్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ నేను సరదాగా అన్న విషయాన్నీ సీరియస్ అంటూ నన్ను బ్లేమ్ చేస్తున్నారు అంటూ ఏడ్చేసింది. 

Bigg Boss Telugu 10: Shalini vs Apurva vs Ram Prasad