అసలు పాన్ ఇండియా మూవీ అంటే ఇది
Ravi Shankar Superb Speech at Hanuman Ansh
పాన్ ఇండియా మూవీస్ అంటే భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించి భారీగా ప్రమోట్ చేసి విడుదల చేసి వందల కోట్లు కలెక్షన్స్ తేవడం కాదు.. రూ. 2 కోట్ల సినిమా రూ.400 కోట్లకు కలెక్షన్స్ తేవడమే పాన్ ఇండియా మూవీ, ఇది అసలు సిసలు పాన్ ఇండియా మూవీ అంటూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి హనుమాన్ అంశ్ ప్రెస్ మీట్లో పొగడడం హాట్ టాపిక్ అయ్యింది.
చాలా తక్కువ అంటే రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ ఈరోజు ఒకే ఒక్క లాంగ్వేజ్ లో వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ చిత్రాలకే బాప్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ఎప్పుడో తెలుగులో అనువాదం చెయ్యాల్సి ఉంది. త్రివిక్రమ్ బ్యానర్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ త్రివిక్రమ్ తప్పుకోవడంతో ఇప్పడు కాస్త లేట్ గా ఈ చిత్రాన్ని రేపు శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు.
తాజాగా హనుమాన్ అంశ్ ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో పాన్ ఇండియా మూవీ అంటే ఇది. జస్ట్ రూ.2 కోట్లతో తెరకెక్కి రూ. 400 కోట్లు కొల్లగొట్టింది అంటూ ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా మైత్రి రవి వ్యాఖ్యలు చేసారు.
















































