చిన్న సినిమాలకే కాదు పెద్ద సినిమాలకు నష్టమే

Big films or small films don't matterBig films or small films don't matter


ఆదర్శ కుటుంబం చిత్రం అక్టోబర్ 9 న వస్తుంది అని చాలా చిన్న సినిమాలు వెనకడుగు వేసాయి. అక్టోబర్ 2 అన్నారు, మళ్లీ 9 అన్నారు. దానితో ఆ రెండు వారాల నుంచి చిన్న సినిమాలు తప్పుకున్నాయి. తర్వాత దసరా అప్పుడు హెవీ ట్రాఫిక్ అంటే పెద్ద సినిమాల హడావిడి దానితో చిన్న సినిమాలు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి.

కానీ ఇప్పుడు ఆదర్శ కుటుంబం ఆఖరి నిమిషంలో వాయిదా వేయడంతో.. ఈవారం వృధా అవుతుంది. ఆదర్శ కుటుంబం వాయిదా విషయం వారం ముందే చెప్పి ఉంటే చిన్న సినిమాలు ఈ వారం ఎలాంటి బెరుకు లేకుండా వచ్చేసేవి. కానీ చివరి నిమిషంలో వాయిదా వేసి వాటి ఆశలపై నీళ్లు చల్లారు.

అయితే ఇక్కడ చిన్న సినిమాలకే కాదు పెద్ద సినిమాలు చివరి నిమిషంలో వాయిదా వల్ల ఆ సినిమా నిర్మాతకు చాలా లాస్, అటు ఓటీటీ కోత ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బందులు, నిర్మాతలకు ఫ్రాఫిట్ పై ఎఫెక్ట్ అవుతుంది. అసలు చివరి నిమిషంలో వాయిదా వేశారు అంటే వాళ్లకెంత ఒత్తిడి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ తీరు ఎలా మారుతుంది. 

Big films