BB10: రౌడీలా మీరు అంటున్న నాగ్
Bigg Boss 10: Nagarjuna fires on Housemates
బిగ్ బాస్ సీజన్ 10 లో ఈ నాలుగో వారం బుల్లితెర ఆడియన్స్ కి మెమొరబుల్ గా గుర్తుండదు, ఎందుకంటే ఈ వారం అంత చెత్త వారం అనే చెప్పాలి. హౌస్ మేట్స్ మధ్యన జరిగిన గొడవలు, వారు మాట్లాడిన తీరు, వారి ఆడిన ఆట అన్ని ఆడియన్స్ లో చిరాకు తెప్పించాయి. అదే విషయంలో ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యారు.
అసలు ఇది బిగ్ బాస్ హౌసా.. వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ హౌస్ అంటూ హోస్ట్ నాగార్జున రావడం రావడమే హౌస్ మేట్స్ ని కడిగిపారేసారు. అమన్, రోహిత్, త్రిగున్ వెంటనే లివింగ్ రూమ్ ని ఖాళీ చేసి గార్డెన్ లోకి రమ్మని కోపంగా చెప్పారు. అపూర్వ సారి.. అపూర్వ గారు అంటూ అపూర్వ ని కెప్టెన్ రూమ్ ని వాడే విధానం అదేనా, నువ్వు డిజాస్టర్ కెప్టెన్ అంటూ అపూర్వ కి మొహం వాచేలా గడ్డి పెట్టారు.
ఇక రామ్ ప్రసాద్ నిన్ను నామినేషన్స్ విషయాలు మాట్లాడొద్దు అన్నారు అనగానే నామినేషన్స్ టైమ్ లో అన్నారేమో అనగానే.. అందుకే నిన్ను కన్నింగ్ అన్నారు అంటూ నాగ్ ఫైర్ అయ్యారు. ఇక షాలిని ని టార్గెట్ చేస్తూ నువ్వు మాట్లాడే మాటలేమిటి షాలిని అంటూ ఆమెపై నాగార్జున ఆగ్రహం చూపించారు.
మీరేమన్నా రౌడీలా అంటూ హౌస్ మేట్స్ ని నాగార్జున ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఏసుకున్న తీరు కి హౌస్ మేట్స్ మొహాల్లో నెత్తురు చుక్క లేదు అనేలా ప్రోమో వదిలారు.
















































