రాశి ఖన్నా బ్యూటిఫుల్ లుక్ వైరల్
Raashi Khanna has given fans a refreshing ethnic look
కొంత కాలంగా గ్లామర్ గర్ల్ రాశి ఖన్నా ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో గత్తరరేపుతున్నాయి. ఆమె సోషల్ మీడియా లుక్స్ కి యూత్ చొంగ కార్చుకుంటున్నారు. అంతలా ఆమె అందాల ప్రదర్శన ఉంటుంది. తాజాగా రాశి ఖన్నా వదిలిన పిక్స్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడాల్సిందే.
ఎత్నిక్ స్టయిల్ లో శారీ కట్టి రాశి ఖన్నా ఫోటోలకు ఫోజులిచ్చింది. మోడ్రెన్ బ్లౌజ్ లో స్లీవ్ లెస్ అయినప్పటికీ ఎలాంటి గ్లామర్ షో లేకుండా అదరగొట్టిన రాశి ఖన్నా న్యూ స్టయిల్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ మధ్య కాలంలో రాశి ఖన్నా ను ఇలా చూసింది లేదు.
ఎప్పుడు మోడ్రెన్ దుస్తుల్లో అందాలు చూపిస్తూ గ్లామర్ ప్రదర్శన చెయ్యడమే అమ్మడు పనిగా పెట్టుకుంది. హిందీ అవకాశాలు రాశి ఖన్నా స్టయిల్లో విపరీతమైన మార్పులు తీసుకొచ్చింది. ఇక ఆమె హిందీ తో పాటుగా సౌత్ లో అందులోను తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ధర్మన్ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తుంది.















































