ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aishwarya Lekshmi on her presence in Raaka

రాకా లో ఛాన్స్ ఇప్పించమంటున్న హీరోయిన్

Aishwarya Lekshmi on her presence in RaakaAishwarya Lekshmi on her presence in Raaka


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ కలయికలో తెరకెక్కుతున్న రాకా చిత్ర అప్ డేట్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ లో ఉండగా... ఈయన కోసం ఏకంగా ఐదుగురు హీరోయిన్ ఈ చిత్రంలో నటిస్తున్నారనే ప్రచారం మొదటినుంచి ఉంది.

అందులో దీపికా పదుకొనె మెయిన్ లీడ్ కాగా.. రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారనే ప్రచారం తో పాటుగా తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి నెగెటివ్ రోల్ పోషిస్తుంది అంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే రాకా లో తాను నటిస్తున్నాను అంటూ వస్తున్న పుకార్లకు ఐశ్వర్య లక్ష్మి చెక్ పెట్టనుంది.

ఆమె ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. నేను రాకా సినిమాలో భాగం కాదు. దయచేసి ఎవరైనా నాకు రాకా  సినిమాలో ఛాన్స్ ఇప్పించమంటూ ఫన్నీగా స్పందించింది. దీనితో ఆమె రాకా లో నటిస్తుంది అనే పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

Hot beauty craves for role in Raaka