OTT : టాక్ షో తో మెగాస్టార్
Chiranjeevi To Host Celebrity Talk Show
సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అంటూ ఆహా ఓటీటీ లో టాక్ తో ఎంతగా సంచలనం సృష్టించారో చూసాం. మూడు సీజన్స్ ను బాలయ్య తనదైన శైలిలో రక్తి కట్టించారు. ఇక కింగ్ నాగార్జున గత ఏడు సీజన్స్ గా బిగ్ బాస్ ని హోస్ట్ చేస్తున్నారు. ఇపుడు మెగాస్టార్ కూడా ఓటీటీ కోసం టాక్ షో కి రెడీ అవ్వబోతున్నారనే న్యూస్ వినిపిస్తుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కోసం చిరు హోస్ట్ గా సెలబ్రిటీ టాక్ షో చేయనున్నట్లు సమాచారం. అయితే నెట్ఫ్లిక్స్ యాజమాన్యం చిరు తో చర్చలు తుది దశలో ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి కాక షూటింగ్ తో బిజీగా వున్నారు. బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తున్న కాక సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుంది.
అంతేకాకుండా చిరు నటించిన విశ్వంభర విడుదల కావాల్సిఉంది. వీటితో పాటుగా చిరు కూడా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది మెగా ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ న్యూస్ అనే చెప్పాలి.
















































