ప్రెగ్నెన్సీ గ్లోతో మెరుస్తున్న సమంత
Samantha is embracing her pregnancy journey in style
టాప్ హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్. నాగ చైతన్య తో విడాకులు తీసుకుని ఒంటరి ప్రయాణంలో రాజ్ నిడిమోరు ఓదార్పుతో మరోసారి ప్రేమలో పడి గత ఏడాది పెళ్లి పీటలెక్కిన సమంత ఈ ఏడాది జూన్ లో ప్రెగ్నెన్సీ విషయాన్నీ బయట పెట్టింది. ప్రెగ్నెంట్ అయ్యాక మెటర్నిటీ లీవ్ అంటూనే సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తుంది.
నటనకు బ్రేక్ ఇచ్చిన సమంత తమిళ కుకింగ్ షో కి హోస్ట్ గా మారింది. రీసెంట్ గానే సమంత సాంప్రదాయ పద్దతిలో శ్రీమంతం చేసుకుంది. ఇక తాజాగా లైట్ గ్రీన్ మోడ్రెన్ డ్రెస్ లో సమంత ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాస్త బబ్లీగా కనిపించిన సమంత ఈ ఫొటోస్ లో ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతుంది.
లూజ్ హెయిర్ లో సమంత చిన్న నెక్ లెస్ తో అదరగొట్టేసింది. సమంత ప్రస్తుతం భర్త రాజ్ తో కలిసి సమయం గడుపుతూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. తాను అసలు ప్రెగ్నెంట్ అవుతాను అని అనుకోలేదని, మా ఇంటి బంగారం షూటింగ్ లోనే తనకు ఈ విషయం తెలిసింది అంటూ సమంత రీసెంట్ గా చెప్పుకొచ్చింది.
















































