ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> IT Raids On Locations Linked To Rakul Preet, Vashu Bhagnani, Panaroma Studios

రకుల్ తో పాటు బాలీవుడ్ సెలెబ్రిటీస్ పై ఐటి దాడులు

 IT Raids On Locations Linked To Rakul Preet, Vashu Bhagnani, Panaroma StudiosIT Raids On Locations Linked To Rakul Preet, Vashu Bhagnani, Panaroma Studios


సినీ సెలబ్రిటీస్ పై అలాగే రాజకీయ ప్రముఖులపై ఐటి దాడులు జరగడం అనేవి కొత్తేమి కావు. సక్రమంగా ఐటి లెక్కలు చూపకపోయినా, లేదంటే జీఎస్టీ కట్టకపోయినా ఐటి అధికారులు మెరుపు దాడులు చేస్తూ ఉంటారు. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో జరగడం అనేది చాలా కామన్.

తాజాగా సౌత్ నుంచి బాలీవుడ్  కి వెళ్లి అక్కడే సినిమాలు చేస్తూ బాలీవుడ్ నిర్మాత కమ్ నటుడు జాకీ భగ్నానీ ని ప్రేమించి వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్, అలాగే సీనియర్ నిర్మాత వాసు భగ్నానీ, పానోరమా స్టూడియోస్ పై ముంబై లో ఐటి అధికారులు దాడులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

సినిమాల నిర్మాణాల పేరుతో విదేశాలకు అక్రమంగా ఫండ్స్ తరలిస్తున్నారని ఐటి అధికారులు ముంబైలో మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాలు జరిగాయనే అనుమానంతో రకుల్, ఆమె మామగారు వాసు భగ్నానీ, పానోరమా స్టూడియోస్ తో లింక్ ఉన్న 12 చోట్ల ఐటీ అధికారులు ఒకేసారి సోదాలు చేస్తున్నారు.

Income Tax Searches 12 Mumbai Locations Linked To Rakul Preet And Production Houses