ప్యారడైజ్: కేసీఆర్ కేరెక్టర్ తో ప్రమోషన్స్
The Paradise: Promotions featuring KCR's character
ది ప్యారడైజ్ చిత్రం గత గురువారం విడుదలై వీకెండ్ ముగిసింది. వీకెండ్ లో ది ప్యారడైజ్ చిత్రం బాక్సాఫీసు దగ్గర ర్యాంపేజ్ ఆడేసింది. డివైడ్ టాక్ తోనే ప్యారడైజ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. నాని కెరీర్ లోనే ప్యారడైజ్ బెస్ట్ ఓపెనింగ్ తెచ్చిన చిత్రంగా నిలిచింది. సోషల్ మీడియా ట్రోల్స్, నెగిటివిటీని అధిగమించి ప్యారడైజ్ నాలుగు రోజులుగా థియేటర్స్ లో హడావిడి చేసింది.
నాలుగు రోజుల్లోనే ది ప్యారడైజ్ చిత్రం రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చెయ్యడమే కాదు, చాలా ఏరియాల్లో 80 శాతం రికవరీ చేసినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు. ఇక కేసీఆర్ కేరెక్టర్ కోసం కేటీఆర్ స్వయంగా ప్యారడైజ్ ని వీక్షించడం.. కొన్ని నిమిషాల కేరెక్టర్ ని చూస్తేనే అభిమానులు కేసీఆర్ కోసం ఎంతగా అభిమానం చూపిస్తున్నారో అంటూ ప్యారడైజ్ ని వీక్షించిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం..
ప్రియదర్శి కేసీఆర్ కేరెక్టర్ లో ఒదిగిపోయిన తీరు, అలాగే బీఆరెస్ వాళ్ళు ప్యారడైజ్ చిత్రాన్ని ఓన్ చేసుకోవడం ఇవన్నీ ప్యారడైజ్ చిత్రానికి ప్లస్ అవుతాయి అనుకున్నారో ఏమో.. ఈరోజు సోమవారం కేసీఆర్ కేరెక్టర్ చేసిన ప్రియదర్శి వర్కింగ్ ఫోటోస్ వదిలింది టీమ్. మరి కేసీఆర్ కేరెక్టర్ తో ప్యారడైజ్ ప్రమోషన్స్ సోమవారం టెస్ట్ కి ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.
















































