BB10: ముఖేష్ త్యాగంతో ఆ ఇద్దరు సేఫ్
BB10: Those two are safe with Mukesh Gowd sacrifice
బిగ్ బాస్ సీజన్ 10 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన రెండోరోజే హోస్ట్ నాగార్జున ఇచ్చిన రూ.15 లక్షల ఆఫర్ ని మిథిలేష్ పట్టుకుని జంప్ అయ్యాడు. దానితో హౌస్ లో గొడవలు జరిగాయి. ప్రైజ్ మనీ లో రూ.15 లక్షలు పోయాయంటూ త్రిగున్, ముఖేష్ గౌడ్ లు అమన్ ఇంకా రోహిత్ లతో గొడవకు దిగారు. ఇక మిథిలేష్ ని చాలామంది బయటా లోపలా విమర్శిస్తున్నారు.
అయితే మూడో వారం వర్షిణి లేదా వంశీ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి డేంజర్ లో నిలబడ్డారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేషన్ తప్పదని అందరూ భావించారు. కానీ నాగార్జున ఈ వారం ఎవరితో టెంప్టేషన్ తో మొదలైందో వారితోనే ఎండ్ చేస్తా అంటూ ముఖేష్ గౌడ్ ని కెప్టెన్సీ అలాగే ఇమ్యూనిటీని వదులుకుని డైరెక్ట్ నామినేషన్ లోకి వెళితే వర్షిణి ఇంకా వంశీ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారని చెప్పారు.
దానితో ముఖేష్ గౌడ్ వర్షిణి, వంశీ ఇద్దరూ మంచి కేపబిలిటీ ఉన్న ప్లేయర్స్ వారి కోసం కెప్టెన్సీ అలాగే ఇమ్యూనిటీ వదులుకుని డైరెక్ట్ నామినేషన్స్ లోకి వెళతా అన్నాడు. వర్షిణి ఒప్పుకోలేదు, కానీ నాగార్జున వర్షిణిని మాట్లాడనివ్వలేదు. ముఖేష్ త్యాగంతో వర్షిణి ఇంకా వంశీ సేఫ్ గా నామినేషన్స్ నుంచి తప్పుకుని మళ్లీ హౌస్ లోకి వచ్చేసారు.
















































