తప్పుడు నిర్ణయాలతో డిప్రెషన్ లోకి హీరోయిన్
Nivetha Pethuraj about personal life
హీరోయిన్ నివేదా పేతురాజ్ మెల్లగా బిజీ అవుతుంది. కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ నటి బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి రెడీ అయ్యింది. కానీ ఆ ప్రేమ ను బ్రేకప్ చేసుకుని మళ్లీ సినిమాలో బిజీ అయ్యింది. ప్రస్తుతం సీనియర్ హీరోలైన వెంకటేష్ తో ఆదర్శ కుటుంబంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే మెగాస్టార్ కాక చిత్రంలోనూ నివేదా పేతురాజ్ కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే చాలామంది హీరోయిన్స్ కాస్మొటిక్ సర్జరీలు చేయించుకున్నట్టుగా తాను కూడా లిప్స్ కి ఫ్లమ్ లిప్స్ కావాలి అనిపించి తన పర్సనల్ డాక్టర్ ని సంప్రదించగా.. ఆయన బాగా తిట్టాడు. అలాంటి సర్జరీ ల వాళ్ళ ఫ్యూచర్ లో హెల్త్ ప్రోబ్లెంస్ వస్తాయని చెప్పడంతో అది మానుకున్నాను, చాలామంది ముఖ్యంగా నిత్యా మీనన్, సాయి పల్లవి లాంటి నటీమణులు ఎలాంటి మేకప్ లేకుండా అందగానే కెరీర్ లో రాణిస్తున్నారు.
నేను ఎందుకు అలా చెయ్యకూడదు అనుకున్నాను. ఇక నేను మనసులో ఏదైనా నెగిటివ్‌గా అనుకుంటే అది జరిగిపోతుంది. నా బాయ్ ఫ్రెండ్ విషయంలో అదే జరిగింది. ఎవరికోసం తను నన్ను వదిలేస్తాడో కూడా ఊహించా. నిజంగా అదే జరిగింది. కొన్నేళ్ల క్రితం సినిమాలు మానేద్దామనుకున్నాను, ఆ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను, ఆతర్వాత ఇబ్బందులు పడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.
ఆ డిప్రెషన్ లోనే పానిక్ అటాక్స్ కూడా వచ్చాయి. ఇక ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి చాలా కష్టపడ్డాను, సినిమా ఆఫర్స్ రాకపోతే హిమాలయాలకు వెళ్ళిపోయి ధ్యానం చేసుకునేదాన్ని అంటూ నివేద పేతురేజ్ చెప్పుకొచ్చింది.
















































