అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్ లోకి ఎన్టీఆర్

NTR Dragon shooting updateNTR Dragon shooting update


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిరోజులుగా డ్రాగన్ సెట్ లో జరిగిన ప్రమాదంలో గాయపడి భుజానికి సర్జరీ చేయించుకుని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన భుజానికి ప్రమాదం జరిగిన తర్వాత మొదటిసారి ఫాహద్ ఫాసిల్ నటించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఈవెంట్ కి రాబోతున్నారు. అయితే ఎన్టీఆర్ గాయంతో ఆగిన డ్రాగన్ షూట్ పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది.

అక్టోబర్ 10 నుంచి ముంబై లో మొదలు కాబోయే డ్రాగన్ కొత్త షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని, 15 రోజుల పాటు ముంబై లోనే ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేసారని తెలుస్తుంది. ముంబై పరిసర ప్రాంతాల్లోని అరుదైన లొకేషన్స్ లో డ్రాగన్ యాక్షన్ ఎపిసోడ్స్ ని దర్శకుడు ప్రశాంత్ ప్లాన్ చేశారట.

ఈ షెడ్యూల్ ఎన్టీఆర్ జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్. బాలీవుడ్ క్యూటీ అలియా భట్ కీ రోల్ లో కనిపించబోతుంది అని సమాచారం. వారు ముంబై షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో కలిసి జాయిన్ అవుతారని తెలుస్తుంది.

NTR to Resume Dragon Shoot