పాపం కాయదు: హ్యాట్రిక్ ప్లాప్స్
Three Flops In A Row Kayadu Lohar
టాలీవుడ్ లో హ్యాట్రిక్ విజయాలతో కొంతమంది హీరోయిన్స్ దూసుకుపోతుంటే.. ఓ హీరోయిన్ టాలీవుడ్ లో చేసిన మూడు సినిమాలు ప్లాప్స్ కొట్టి ఐరెన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఆమె కాయదు లోహర్. అందం, గ్లామర్ అన్ని ఉన్నాయి కానీ అదృష్టమే ఆవగింజంతైనా లేదు. అదే కాయదు బ్యాడ్ లక్.
శ్రీ విష్ణు సినిమా అల్లూరి తో టాలీవుడ్ లోకి దిగిన కాయదు లోహర్ కి ఆ సినిమా రిజల్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. టాలీవుడ్ లో నటించిన మొదటి చిత్రమే కాయదు లోహర్ ని బాగా డిజప్పాయింట్ చేసింది. ఆతర్వాత విశ్వక్ సేన్ ని నమ్ముకుంది. ఫంకీ చిత్రంలో కాయదు లోహర్ విశ్వక్ కి జోడిగా నటించింది. ఆ చిత్రము ఆమెను నిరాశపరిచింది.
ఇక రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించింది. ది పారడైజ్ మూవీలో కాయదు లోహర్ నాని కి జోడిగా నటించింది. కానీ ఆ చిత్రంలో కాయదు లోహర్ ను చూపించిన తీరుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ని అందరూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాయదు గ్లామర్ షో కోసమే ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసింది అంటున్నారు.
ప్యారడైజ్ రిజల్ట్ కూడా తేడా కొట్టడంతో కాయదు ముచ్చటగా టాలీవుడ్ లో మూడో చిత్రంతో ప్లాప్ అందుకున్నట్టయ్యింది. సో హ్యాట్రిక్ ప్లాప్స్ తో ఈ గ్లామర్ హీరోయిన్ బాగా డిజప్పాయింట్ మోడ్ లోకి వెళ్లపోయింది.
















































