అడ్వాన్స్ బుకింగ్ నిలబెట్టింది!
Advance booking saved The Paradise
నిజమే నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రాన్ని అడ్వాన్స్ బుకింగ్ నిలబెట్టింది అనే చెప్పాలి. లేదంటే ప్రీమియర్స్ నుంచే డివైడ్ టాక్ స్ప్రెడ్ అయిన ఈ చిత్రానికి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే మాములు విషయం కాదు. ది ప్యారడైజ్ ట్రైలర్ ఇవ్వలేదు, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనుకుంటే.. సినిమా విడుదలకు ముందు సినిమాపై హైప్ వచ్చేసింది.
దానితో ప్రీమియర్స్ అలాగే రిలీజ్ డే రోజున టికెట్ లు హాట్ కేక్స్ లా అమ్ముడు పోవడమే కాదు, శుక్రవారం హైదరాబాద్ లో నిమజ్జనం సెలవు, అలాగే శని, ఆదివారం వీకెండ్స్ లో ప్యారడైజ్ పై విడుదలకు ముందు ఉన్న అంచనాలతో అడ్వాన్స్ గానే బుకింగ్స్ జరగడంతో ప్యారడైజ్ ఈ లాంగ్ వీకెండ్ లో సేవ్ అయ్యింది.
లేదంటే ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో ప్యారడైజ్ పై వచ్చిన నెగిటివిటి చూసిన ఎవ్వరూ టికెట్ అప్పటికప్పుడు కొనుక్కుని ప్యారడైజ్ థియేటర్ కి వెళ్ళే సాహసం చేసేవారు కాదు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ ప్యారడైజ్ ని నిలబెట్టాయి అనేది.
















































