BB10: ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్

BB10: Big twist in eliminationBB10: Big twist in elimination


బిగ్ బాస్ సీజన్ 10 మూడో వారం ముగియడానికి సిద్దమైంది. సీజన్ 10 లో కామనర్స్ vs సెలబ్రిటీస్ కాదు.. ఎక్కువగా సెలబ్రిటీస్ మధ్యలోనే గొడవలు, గ్రూప్ లు కనిపిస్తున్నాయి. సెలెబ్రిటీ గ్రూప్ లో త్రిగుణ, వంశి ఒకటిగా కనిపిస్తే వర్షిణి, ముఖేష్ గౌడ్, సుదీర్లు ఓ బ్యాచ్, రామ్ ప్రసాద్, నరేష్, దేబ్జానీ లు మరొక గ్రూప్ అయ్యారు. ఇక కామనర్స్ లో రోహిత్, షాలిని, సృష్టి కలిసి కనిపిస్తున్నారు. అమన్, ఝాన్సీ, చరణ్ లు న్యూట్రల్ గా ఉన్నారు.

అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ గెలిచి ముఖేష్ గౌడ్ హౌస్ లో రెండో కెప్టెన్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అపూర్వ, మిథిలేష్ లు ముఖేష్, ఝాన్సీలకు సపోర్ట్ చెయ్యగా ఆ టాస్క్ లో అపూర్వ, ముఖేష్ గెలుపొందారు. అయితే ఈ మూడో వారం హౌస్ నుంచి వెళ్లే కంటెస్టెంట్ పై అందరిలో ఇంట్రెస్ట్ మొదలైంది.

కారణం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మొత్తం నామినేషన్స్ లో ఉన్నారు. త్రిగుణ, సుధీర్, వర్షిణి, చరణ్, షాలిని, టెంపర్ వంశి, ఝాన్సీలు ఎలిమినేషన్ లో ఉండగా.. ఈ వారం మొత్తం త్రిగుణ ఓటింగ్ లో టాప్ లోనే కనిపించాడు. సుధీర్ సింపతీ ఓట్స్ తో సెకండ్ ప్లేస్ ను ఆక్రమించాడు. అయితే వంశి, ఝాన్సీలు ముందు నుంచి డేంజర్ జోన్ లోనే ఉన్నారు.

వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు. వారెవరంటే ముందు నుంచి స్ట్రాంగ్ గా కనిపించిన వంశి ఈవారం ఎలిమినేట్ అవ్వలేదు. అయితే బిగ్‌బాస్ ఇంటిలో కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఓ టెప్టింగ్ ఆఫర్ ఇచ్చాడు. ఇంటిలో ఉంటారా.. లేదంటే పరిచే మనీ ల 15 లక్షల క్యాష్ ఉన్న సూట్ కేసును పట్టుకొని బయటకు వెళ్ళిపోతారా అనగానే హౌస్ మేట్స్ ఈ టెంప్టింగ్ ఆఫర్‌కు వెనకడుగు వేశాడు. కానీ మితిలేష్ మాత్రం సూట్ కేస్ పట్టుకొని బయటకు వెళ్తానని అందరిని కన్విన్స్ చేసి మరీ సూట్ కేస్ పట్టుకెళ్లినట్టుగా తెలుస్తుంది.


 

Bigg Boss 10 3rd week episode highlights