బాబు గారిని వాడుకునే పద్దతి ఇదేనా?

Mohan Babu role in The ParadiseMohan Babu role in The Paradise

 

కలక్షన్ కింగ్ మోహన్ బాబు.. ఇది ఆయనకు అభిమానులు ఇచ్చిన ట్యాగ్. ఇప్పుడు కెరీర్ లో వెనకబడి ఉండొచ్చు.. కానీ ఒకప్పుడు ఆయన విలనిజాన్ని, హీరోయిజాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చెయ్యబట్టే ఆయనకు కలెక్షన్ కింగ్ అనే పేరు వచ్చింది. ఆయన సినిమాల్లో ఎంత పవర్ ఫుల్ కేరెక్టర్స్ చేసారో.. నిజ జీవితంలోను ఆయన అలానే పవర్ ఫుల్ గా కనిపిస్తారు.

రీ ఎంట్రీలో మోహన్ బాబు కెపాసిటీని దర్శకులు సరిగ్గా వాడుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. శ్రీనివాస మంగాపురమే కాదు.. ఇప్పుడు ది ప్యారడైజ్ లోను మోహన్ బాబు ని దర్శకుడు శ్రీకాంత్ సరిగ్గా వాడుకోలేదు. ప్యారడైజ్ లో మంచి పవర్ ఫుల్ కేరెక్టర్, ఆయన పాత్ర డిజైన్ కూడా బావుంది. ఆయన ప్యారడైజ్ కి ప్రధాన ఆకర్షణ. తెరపై కనిపించిన ప్రతిసారి ఆయన కేరెక్టర్ ని చూసి ఆడియన్స్ విజిల్స్ వేశారు.

మోహన్ బాబు ఫ్లాష్ బ్యాక్ లో భయపెట్టిన విధానం, ఆయన చుట్టూ సృష్టించిన ప్రపంచం డిఫరెంట్ గా ఆకట్టుకున్నాయి. సినిమాకి ఏ మాత్రం బెటర్ టాక్ వచ్చినా మోహన్ బాబు కేరెక్టర్ పై పొగడ్తలు కురిపించేవారు. మోహన్ బాబు ని ఇంకాస్త పవర్ ఫుల్ గా చూపిస్తే బావుండేది, కానీ శ్రీకాంత్ ఓదెల కూడా ఆయన్ని వాడుకోవడం లో విఫలయ్యాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

Mohan Babu plays Shikanja Maalik in Paradise