ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Not Kaaka, Chiru—we need Vishwambhara leaks!

కాకా కాదు విశ్వంభర లీక్స్ కావాలి చిరూ..!

Not Kaaka, Chiru—we need Vishwambhara leaks!Not Kaaka, Chiru—we need Vishwambhara leaks!

 

అవును మెగా ఫ్యాన్స్ అడుగుతున్నది ఇదే. కాకా లీక్స్ కాదు మాకు విశ్వంభర లీక్స్ ఇవ్వండి చిరూ అంటూ చిరు ని మెగా అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. చిరు లీక్స్ అంటూ గత రాత్రి జరిగిన సందీప్ కిషన్-జాసన్ విజయ్ సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాకా అప్ డేట్ ఇచ్చారు మెగాస్టార్.

కాక కి సంబందించిన ఫస్ట్ హాఫ్ షూటింగ్ ఫినిష్ అవడమే కాదు, సెకండ్ హాఫ్ కి సంబందించిన 30 పర్సెంట్ షూటింగ్ కూడా పూర్హయ్యింది, సంక్రాంతి మనదే అన్న చిరు మాటలు మెగా ఫ్యాన్స్ కి నచ్చేసాయి. కానీ ఎక్కడో అడుగున పడిపోయి రిలీజ్ డేట్ విషయంలో తికమక పడుతున్న విశ్వంభర విషయంలోనూ ఇలాంటి లీక్స్ కావాలని మెగా ఫ్యాన్స్ అడుగుతున్నారు.

విశ్వంభర రిలీజ్ తేదీపై ప్రస్తుతం గందరగోళం నడుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభరను తేవాలని దర్శకుడు వశిష్ట, కుదరదు నేను డేట్ ముందే లాక్ చేశాను అని కాకా దర్శకుడు బాబీ ఇలా ఎవ్వరూ తగ్గడం లేదు. మధ్యలోకి మెగాస్టార్ వెళ్లినా పని జరగలేదు. దానితో విశ్వంభర రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఇలాంటి సమయంలో చిరు కాకా లీక్స్ కాకుండా ఆ విశ్వంభర లీక్స్ ఇస్తే బావుంటుంది అనేది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం. 

Chiranjeevi not confident about Vishwambhara