ఇంట్రెస్టింగ్ : కాకా పై చిరు లీక్స్
Mega update here on Kaaka
కొన్నాళ్లుగా మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలపై లీక్స్ ఇస్తూ మెగా అభిమానులకు కిక్ ఇస్తున్న విషయం తెలిసిందే. తన సినిమాల అప్ డేట్స్ ని వేరే సినిమా ఈవెంట్స్ లో లీక్ చేస్తూ ఉంటారు. తాజాగా సీఎం విజయ్ కొడుకు జాసన్ విజయ్ దర్శకత్వంలో సందీప్ కృష్ణ నటించిన సిగ్మా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు చిరు.
తాను కాకా సెట్ నుంచి నేరుగా ఈ ఈవెంట్ కి వచ్చినట్టుగా చెప్పడమే కాదు.. కాకా షూటింగ్ అప్ డేట్ ఇస్తూ.. సినిమాకి సంబందించిన ఫస్ట్ హాఫ్ ఫినిష్ అవడమే కాకుండా సెకండ్ హాఫ్ లోని 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది, సంక్రాంతికి అనుకున్న తేదీకే కాకా మీ ముందుకు వస్తుంది, సంక్రాంతి మనదే అంటూ తనకు అప్ డేట్స్ లీక్ చేసే అలవాటు ఉన్నట్టుగా చెప్పి మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు ఆయన.
అంతేకాకుండా సాయంత్రం వరకు కాకా షూట్ చేసి మళ్లీ ఈవెంట్ కి వెళ్లడం ఎందుకు రెస్ట్ తీసుకోమని యూనిట్ సభ్యులు చెప్పారు. కానీ నాకు ఇతరుల ఈవెంట్ కి వెళ్లి యువకులను, కొత్తవారిని ప్రోత్సహించడం అలాగే వేరే సినిమా ల ఈవెంట్స్ కి వెళ్లడం నాకు ఇష్టం, కష్టం అస్సలు అనిపించదు అంటూ చిరు అక్కడ ఉన్న అందరిని మోటివేట్ చేసారు.
















































