ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Have heroines really become that insignificant?

హీరోయిన్స్ మరీ అంత చులకనైపోయారా?

Have heroines really become that insignificant?Have heroines really become that insignificant?


భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద సినిమాలు అంటే హీరోలకు హైప్ ఇచ్చినంతగా, వారికి ఇచ్చే ఎలివేషన్ లో 10 పర్సెంట్ కూడా హీరోయిన్స్ కి ఇవ్వడం లేదు దర్శకులు. హీరోల పక్కన కలర్ ఫుల్ హీరోయిన్ ఉండాలని చూస్తున్నారు తప్ప ఆ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలనే మాట మరిచిపోతున్నారు.

హీరోయిన్ ని సినిమాల్లో సాంగ్స్ కోసమో, లేదంటే యూత్ ని అట్రాక్ట్ చెయ్యడానికి గ్లామర్ షో చేయించడానికో తీసుకుంటున్నారు కానీ.. ఆమె పాత్రకు కావాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తే అది కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఎంత బావుంటుందో అనేది విస్మరిస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది సినిమానే తీసుకోండి. జాన్వీ కపూర్ ని బుచ్చి బాబు చూపించిన తీరు ఎంతగా విమర్శల పాలయ్యిందో చూసారు.

అదే మాదిరి నాని ది ప్యారడైజ్ చిత్రంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల హీరోయిన్ కాయదు లోహర్ ని చూపించిన తీరుపై సినీ విమర్శకులు మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా మండిపడుతున్నారు. కాయదు లోహర్ ని పాటలో మరీ అతిగా చూపించిన తీరుని ఎండకడుతున్నారు.

ఈ రెండే కాదు, ఇంకా చాలామంది దర్శకులు ఇదే మాదిరి ఆలోచన చేస్తున్నారు. కానీ హీరోయిన్ పై దర్శకుల దృక్పధం మారాలి, ఆలోచన మార్చుకోవాలి అనే సలహాలు ఇపుడు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తున్నాయి.

Kayadu Lohar in The Paradise