పిల్లలపై రష్మిక క్రేజీ కామెంట్స్
I'd go to war for my kids: When Rashmika
టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరో విజయ్ దేవరకొండ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రష్మిక అత్తారింట్లో కన్నా ఎక్కువగా షూటింగ్ స్పాట్స్ లోనే కనిపిస్తుంది. మరి పాన్ ఇండియా మార్కెట్ లో అంత క్రేజీ హీరోయిన్ రష్మిక.
ఇక పెళ్లి తర్వాత మొదటిసారిగా భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి చిత్రంలో నటించిన రష్మిక రీసెంట్ గా విజయ్ తనవాడే అయినప్పటి.. ఇంకా విజయ్ పై క్రష్ పోవడం లేదు అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. తాజాగా రష్మిక పిల్లలపై, మాతృత్వంపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.
అంటే రష్మిక పెళ్లి తర్వాత పిల్లలను ప్లాన్ చేసుకుంటుంది అని పొరబడుతున్నారమేమో.. కాదు ఆమె తన ఫ్యూచర్ లో పిల్లలు పుడితే ఎలా ఉంటుందో అనేది చెప్పుకొచ్చింది. నేనింకా తల్లిని కాకపోయినా.. ఫ్యూచర్ లో నాకు పుట్టబోయే పిల్లలంటే అప్పుడే నాకు ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. వాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నా.
నా పిల్లల కోసం నేను ఏం చేయడానికైనా, దేనికైనా సిద్ధమే. అవసరమైతే వారి కోసం ఫైట్ చెయ్యడానికి కూడా నేను వెనకాడను. అందుకు తగ్గట్లుగా నన్ను నేను శారీరకంగా ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకుంటా అంటూ రష్మిక తనకు పుట్టబోయే పిల్లల విషయముల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
















































