20 ఏళ్లకే ఇండస్ట్రీని ప్రశ్నించిన బోల్డ్ నటి!

Niki Walia recalls being a rebelNiki Walia recalls being a rebel

బాలీవుడ్‌లో మూడు ద‌శాబ్దాల ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకున్న నటి నికీ వాలియా (అనేజా) ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసారు.  ప్రారంభంలోనే చలనచిత్ర రంగానికి దూరమై బుల్లితెరకు మారడానికి గల కారణాలను వివ‌రించారు. ఇండస్ట్రీలో అవకాశాల కంటే  ఆత్మగౌరవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోని అనుచిత వ్యవహారాలను ఎదిరించిన తిరుగుబాటుదారుగా తాను ఉండేదాన్నని నికీ గుర్తు చేసుకున్నారు.

`సినిమా బిజినెస్ పెంచుకోవడానికి లేదా డిస్ట్రిబ్యూటర్లను ఆకట్టుకోవడానికి డిన్నర్లకు వెళ్లాలని నిర్మాతలు కోరినా? నేను అందుకు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. `మిస్టర్ ఆజాద్` షూటింగ్ సెట్‌లో సరైన మర్యాద దక్కనప్పుడు ఆ చిన్న వయసులోనే సినీ మ్యాగజైన్ ద్వారా నా అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాను` అని  పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశాల కోసం తన సూత్రాలను పక్కన పెట్టకపోవడం వల్లే సినిమాలు వదిలి టెలివిజన్ రంగం వైపు అడుగులు వేశానని తన సహనటుడు అనిల్ కపూర్‌తో కూడా కేవలం వృత్తిపరమైన పరిమితులనే పాటించానని స్పష్టం చేశారు.

కెరీర్ ప్రారంభం నుంచి తనను సీనియర్ నటి మాధురీ దీక్షిత్‌తో పోల్చడం ఇప్పటికీ కొనసాగుతోందని నికీ వాలియా అన్నారు. అలాగే కాస్టింగ్ డైరెక్టర్లు తనను కేవలం పట్టణ నేపథ్యం ఉన్న `అర్బన్`, `ఎలైట్` పాత్రలకే పరిమితం చేస్తున్నారని విభిన్నమైన గ్రామీణ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. `పా` సినిమాలో అమితాబ్ బచ్చన్ గారిని విభిన్నమైన రూపంలోకి మార్చినట్లే సరైన పాత్ర లభిస్తే తన రూపాన్ని పూర్తిగా మార్చుకుని నటనలో కొత్త కోణాన్ని చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
 

Nikki Walia says she was attacked for quitting Bollywood