ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The audience's entire focus is on Paradise!

ఆడియన్స్ ఫోకస్ మొత్తం ప్యారడైజ్ పైనే!

The audience's entire focus is on Paradise!The audience's entire focus is on Paradise!


మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని ది ప్యారడైజ్ పై ఎంతగా అంచనాలున్నాయో ప్రీ సేల్స్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. నాని సినిమాకి ఈ రేంజ్ క్రేజా అని ఆశ్చర్యపోయేలా, ఎహే నాని టైర్ 2 హీరో ఏంటి, ప్యారడైజ్ ఓపెనింగ్స్ తో నాని సరికొత్త రికార్డులు సెట్ చెయ్యబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ఎటు చూసినా ప్యారడైజ్ ముచ్చట్లే.

హైదరాబాద్ లో నాని సినిమాకి ప్రీమియర్స్ ట్రెండ్ చూస్తే ప్యారడైజ్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థమైపోతుంది. మల్టిప్లెక్స్ ల్లో ఎన్ని షోస్ పడుతున్నాయో అన్ని సోల్డ్ అవుట్, ఇక సోషల్ మీడియాలో నాని తోపు, నాని తురుము, ప్యారడైజ్ సూపర్ హిట్ పక్కా అంటూ పడుతున్న ట్వీట్లతో ఆడియన్స్ ఫోకస్ మొత్తం ప్యారడైజ్ పైనే పడింది.

ప్రపంచ వ్యాప్తంగా మొదటిరోజు ప్రీ సేల్స్ రూ.43 కోట్ల గ్రాస్ పైకి చేరింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఓవర్సీస్ లోను 1 మిలియన్ కౌంటింగ్, ట్రైలర్ లేకుండా ప్యారడైజ్ పై కనిపిస్తున్న క్రేజ్ చూస్తే మిగతా స్టార్స్ కి మతిపోవాల్సిందే అంటూ నాని అభిమానులు కామెంట్స్.. అబ్బో సోషల్ మీడియా, ఇంకా బయట మొత్తం ప్యారడైజ్ న్యూస్ లు, ముచ్చట్లే.

మరి నాని ప్యారడైజ్ చిత్రం ఈ క్రేజ్ తో, హైప్ తో ఎలాంటి రికార్డులు తిరగ రాస్తుందో జస్ట్ వెయిట్ అండ్ సి. 

The Paradise Movie