ప్యారడైజ్: ఈ రెస్పాన్స్ ఊహించి ఉండరు
Insane Craze for The Paradise
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రెండో మూవీగా తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం మరొక్క రోజులో అంటే రేపు సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 24 న సినిమా రిలీజ్ చెయ్యడానికి పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో సినిమాని వాయిదా వేద్దామనుకున్న మేకర్స్ కి ఓటీటీ షాక్ ఇచ్చింది.
దానితో చేసేది లేక ఎంత కష్టమైనా సెప్టెంబర్ 24 కె సినిమాని తీసుకురావాలని ఫిక్స్ అయ్యి అటు డైరెక్టర్ శ్రీకాంత్, ఇటు నాని, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఎవరికీ వాళ్లే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో తలమునకలయ్యారు. మరో వారం సినిమా విడుదలకు టైం ఉంటె గనక ప్రమోషన్స్ పక్కాగా చేద్దామనుకున్నారు.
కానీ సమయం లేకపోవడంతో హిందీ విడుదల ఆపేసారు. అయితే ప్యారడైజ్ ఫస్ట్ ప్రెస్ మీట్లో హీరో నాని కానీ, శ్రీకాంత్ ఓదెల కానీ, నిర్మాత కానీ ఎవ్వరి మోహంలో నవ్వు లేదు. సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనే భయం కనిపించింది. కానీ విడుదలకు ముందు ప్యారడైజ్ పై కనిపిస్తున్న క్రేజ్, వస్తున్న రెస్పాన్స్ నిజంగా అటు మేకర్స్, ఇటు నాని యాంటీ ఫ్యాన్స్ ఎవ్వరూ ఊహించి ఉండరు.
ప్యారడైజ్ ప్రమోషన్స్ ఎలా ఉన్నా సినిమాపై విపరీతమైన ఆసక్తి, క్రేజ్ కనిపిస్తుంది. టికెట్ బుకింగ్స్ లో ప్యారడైజ్ అన్ని ఏరియాల్లో ర్యాంప్ ఆడేస్తుంది.
















































