ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Revanth Reddy Responds to Nani Request

హీరో నాని రిక్వెస్ట్ పై స్పందించిన సీఎం

Revanth Reddy Responds to Nani RequestRevanth Reddy Responds to Nani Request

 

హీరో నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం రేపు సెప్టెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు రాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ తో ప్యారడైజ్ సందడి మొదలు కాబోతుంది. గత వారం రోజులగా డే అండ్ నైట్ నాని ప్యారడైజ్ ప్రమోషన్స్ కోసం కష్టపడడమే కాదు పదివేల మంది అభిమానులకు భోజనం పెట్టి ఫోటోలకు ఫోజులిచ్చారు నాని.

అయితే ఈరోజు నైట్ ప్రీమియర్ ని తన అభిమానులతో కలిసి హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్స్ లో ప్యారడైజ్ చిత్రాన్ని చూసేందుకు అనుమతి కోరుతూ నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డిలను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

సెక్యూరిటీ మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు హీరో నాని కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలపడమే కాదు, నాని అడిగిన పర్మిషన్ కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని అధికారులు పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్‌ రెడ్డి.. ట్వీట్ చేసారు.
 

CM Revanth Reddy Appreciates Nani Approach To Watch Paradise With Audience