ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Teja's Remuneration Shocks Tollywood?

రాజా తీరులో మార్పు లేదు

Ravi Teja's Remuneration Shocks Tollywood?Ravi Teja's Remuneration Shocks Tollywood?


మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడి విడుదలకు ముందు ఆయన పనైపోయింది, వరస వైఫల్యాలు ఆయన కెరీర్ పై ఎఫెక్ట్ పడేలా చేసాయి. రవితేజ పారితోషికం తగ్గించుకోకపోతే ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు ఉండరు, ప్రోపర్ గా ప్రమోషన్స్ కి రారు, ఆయన ఇకపై మారకపోతే చాలా కష్టం ఇది ఆయన విషయంలో వినిపించిన కామెంట్స్.

కానీ ఇరుముడి తో రవితేజ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇరుముడితో బిగ్ బ్లాక్ బస్టర్ అందుకుని నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చారు. ఒక్కసారిగా ఇరుముడి తో ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు. దానితో రవితేజ మళ్లీ పాత బాటలోకి వెళ్లిపోయారనే మాట సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది.

ఇరుముడి తర్వాత ఆయన పారితోషికం బాగా పెంచేశారు, తదుపరి సినిమాకు రూ.40 కోట్లకు పైగా నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు, ఇప్పటికే ఒక నిర్మాత రవితేజ చెయ్యాల్సిన సినిమా నుంచి డ్రాప్ అయ్యారు అనే న్యూస్ చూసి రవితేజ ఇక మారకపోతే ఎలా అంటున్నారు. ఇరుముడి అటు పారితోషికం, ఇటు లాభాల్లో షేర్ కలిపి మొత్తం రూ.60 కోట్లు గిట్టుబాటు అయ్యింది.

అలానే తదుపరి చిత్రం కోసం ఏకంగా డైరెక్ట్ గా రవితేజ రూ.40 కోట్లు అందుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ తదుపరి మూవీ ఉండబోతుంది. 

Ravi Teja