అక్కడ హిట్ ఇక్కడ ఫెయిల్
Hit In Theatres; Flop On OTT!
చాలా సినిమాలు థియేటర్స్ లో హిట్ అవుతున్నాయి. కానీ ఓటీటీ లలో మాత్రం అంతంతమాత్రం టాక్ తో సరిపెట్టుకుంటున్నాయి. ఈమధ్య కాలంలో చాలా సినిమాలు అలానే ఉన్నాయి. చెన్నై లవ్ స్టోరీ థియేటర్స్ లో సూపర్ హిట్ అయితే, ఈ చిత్రం ఓటీటీ లోకి వచ్చాక ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది.
ఇక అధర్వ మురళి ఇదయం మురళి చిత్రం కూడా థియేటర్స్ లో చూసి ఆహా ఓహో అన్నారు, కానీ అది ఓటీటీ లో చూసి ఇదేం సినిమారా బాబు అన్నారు. థియేటర్స్ లో మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అది ఓటీటీ లోకి వచ్చేసరికి టివి కదా ఆ ఫీల్ మిస్ అవుతున్నాం అంటున్నారు. హెవీ యాక్షన్ ఘట్టాలు, ఎమోషన్ ఇవన్నీ ఓటీటీ లలో తేలిపోతున్నాయనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ చేసాక ఓటీటీ లో సినిమాలు చూడాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి థియేటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇరుముడి చిత్రాన్ని ఓటీటీ లో చూసి ఓకే అంటున్నారు. మరి థియేటర్స్ లో మంచి హిట్స్ గా నిలిచి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాలు ఓటీటీ లోకి వచ్చేసరికి డివైడ్ టాక్ తెచ్చుకోవడమే చాలామందికి అర్ధం కాని విషయం.
అయితే కొంతమంది మళ్లీ థియేటర్స్ వైపు వెళుతున్న ప్రేక్షకులకు ఓటీటీ లో సినిమాలు చూసేందుకు ఇష్టపడడం లేదు, థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ముందు ఓటీటీ లో చూసేందుకు ప్రేక్షకులు వెనక్కి తగ్గడమే దీనికి ప్రధానం కారణం అంటున్నారు.
















































