కార్తీ మేలుకోవాల్సిన టైమొచ్చింది

Wake up call for KarthiWake up call for Karthi

 


కోలీవుడ్ హీరో కార్తీ అలెర్ట్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది. రొటీన్ కథలతో సినిమాలు చేస్తే ఏమవుతుందో రీసెంట్ గా సర్దార్ 2 నిరూపించింది. ఆ చిత్రానికి కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు. సర్దార్ 2 చూసి మరో టాక్సిక్ అంటున్నారు అంటే ఆ సినిమా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కార్తీ డ్యూయెల్ రోల్ లో ఎంత కష్టపడినా ఫలితం ఇలా ఉంటె పేరెలా వస్తుంది.

మరి ఇదే మాదిరి కార్తీ సినిమాలు చేస్తే వరసగా వైఫల్యాలే పలకరిస్తాయి. మూస కథలు, మూస దర్శకులను పక్కనపెట్టి కొత్తగా ఆలోచించాలని అభిమానులు కోరుతున్నారు. అన్న సూర్య ట్రాక్ లో పడినట్లుగా తమ్ముడు కార్తీ కూడా ట్రాక్ ఎక్కాలని ఈ బ్రదర్స్ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.

ప్రస్తుతం కార్తీ మార్షల్ అనే చిత్రం తో పాటుగా నాని ప్రొడక్షన్ లో హిట్ ద ఫోర్త్ కేస్ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలతో కార్తీ బ్యాక్ బౌన్స్ అవ్వాలని, ఇకపై కార్తీ సినిమాలను ఆచి తూచి ఎంచుకోవాలని, లోకేష్ కనగరాజ్ తో ఖైదీ 2 చిత్రాన్ని త్వరగా మొదలు పెట్టాలంటూ కార్తీ అభిమానులు కార్తీకి రిక్వెస్ట్ పెడుతున్నారు. 

Karthi's recent box office run is a wake-up call